ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-27T04:15:56+05:30 IST

జిల్లా ప్రజలకు మీ సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన సేవలు అందిం చాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి: కలెక్టర్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, నవంబరు 26: జిల్లా ప్రజలకు మీ సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన సేవలు అందిం చాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి   అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్‌ నందు అదనపు కలెక్టర్‌లు, జెడ్సీ సీఈఓ ఐటిడీఏ పీఓ, డిపిఓ, డిఎంహెచ్‌ఓ, ఆర్డీఓ, తహాసిల్దార్లు, ఎంపిడిఓలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా  ఈ గవర్నెన్స్‌ సొసైటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఆ యన మాట్లాడుతూ మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల్లో నేరేఽ్దశించిన రుసుము కన్నా అధికంగా వసూళ్లు చేయకుండా నిరంతర తనిఖీలు నిర్వ హిం చాలన్నారు. పరిపాలనలో పారదర్శకత  ఉండాల న్నారు. ప్రభుత్వ సరఫరాల చేయబడిన స్టేషనరీలో మాత్రమే ధ్రు వీకరణ పత్రాలు జారీ చేయు విధంగా చర్య లు తీసుకోవాలని తాహాసిల్దార్లను ఆదేశించారు. సర్టీఫికెట్లు  మార్పిడి చేస్తున్నారని బార్‌కోడ్‌ ఉన్న స్టేషనరీల్లో మాత్రమే ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు. మీ సేవా కేంద్రాల్లో  నిర్వహిస్తున్న సేవలపై నిర్వాహాకులతో సమావేశం నిర్వహించి నివేదికలు అందజేయాలన్నారు. ఆకస్మిక తనికీలు నిర్వహించి ధరల పట్టిక ఏర్పాటు చేశారా, ప్రజలకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి,వారి స్పందనపై నివేదికలను అందజేయాలన్నారు. 


Updated Date - 2020-11-27T04:15:56+05:30 IST