మాస్క్‌లను విధిగా ధరించాలి
ABN , First Publish Date - 2020-04-07T10:07:56+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు విధిగా మాస్క్‌లను ధరించాలని అత్యవసర వైద్యసేవలకు

స్వీయనిర్భందాన్ని పాటించాలి
జిల్లా ప్రజలకు కలెక్టర్ కర్ణన్ సూచన
ఖమ్మం కలెక్టరేట్, ఏప్రిల్, 6: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు విధిగా మాస్క్‌లను ధరించాలని అత్యవసర వైద్యసేవలకు తప్ప స్వీయనిర్భందంలోనే ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్ ప్రజలకు సూచించారు. వైరస్ నివారణ కు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టి లాక్‌డౌన్‌ను అమలుచేస్తోందని ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఆయన కోరారు. జిల్లాలో నిన్నటి వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి పార్టీ పనిపై ఢిల్లీ వెళ్లి వచ్చారని ఆ వ్యక్తికి ఈనెల 2వ తేదీన క్వారెంటైన్‌లో ఉంచి రక్తన మూనాలను నిర్ధారణ కోసం పంపించగా ఆ వ్యక్తికి పాజిటివ్ ఉన్నట్లు వెల్లడైందని కలెక్టర్ తెలిపారు. ఆ వ్యక్తి నివాస ప్రాంతమైన పెద్దతండాలో వైద్యాధికారులు ఉన్నతస్థాయి బృందం పర్యటించి అతని కుటుంబ సభ్యులను అతనితో కలిసిన మరో 45 మందిని గుర్తించి క్వారెంటైన్‌కు తరలించినట్లు కలెక్టర్ వివరించారు.
జిల్లా ప్రజలంతా రాబోయే ఎనిమిది రోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య పోలీస్ శాఖ సలహాలను పాటించి ఇంటినుంచి బయటకు రాకుండా ఉండాలని కలెక్టర్ కోరారు. వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు స్వీయ నిర్భందంతో పాటు ప్రజలంతా విధిగా మాస్కులను ధరించాలని నిత్యావసరాలు ఇతర వైద్య సేవలకోసం కేవలం ఒక్కరు మాత్రమే అదీ మాస్క్ ధరించి బయటకు రావాలని కోరారు.
అనవసరంగా చిన్నపిల్లలను, కుటుంబ సభ్యులను రోడ్లపైకి తీసుకురావద్దని వైరస్ వ్యాప్తి ఏవిధంగా సంక్రమిస్తుందో తెలియని విపత్కర పరిస్థితులు ఉన్నాయని కుటుంబ సభుయల శ్రేయస్సు కోసం మరో ఎనిమిది రోజుల పాటు లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరించాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలతో అవసరమైన ఏర్పాట్లు చేసిందని ప్రజలు ఆందోళన భయబ్రాంతులకు గురింకాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడంతో పాటు ఇంటికే పరిమితం కావాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.