మాస్క్ లేని వారికి జరిమానా
ABN , First Publish Date - 2020-11-28T04:41:47+05:30 IST
మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి మధిర మునిసిపల్ సిబ్బంది శుక్రవారం జరిమానాలు విదించారు.

మధిరటౌన్, నవంబరు 27: మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి మధిర మునిసిపల్ సిబ్బంది శుక్రవారం జరిమానాలు విదించారు. మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారితో పాటు, దుకాణాలలో మాస్క్ లు లేకుండా విక్రయిస్తున్న యజమానులకు కూడా జరిమానాలు విదించారు. కొవిడ్ సెకండ్ వేవ్ విజృంబిస్తుండటంతో రెండు రోజులుగా మునిసిపల్ సిబ్బంది మాస్క్‌ల వాడకంపై అవగాహన కలిపిస్తూ ప్లెక్సీల ద్వారా, మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.