గోదావరిలో యువకుడి గల్లంతు

ABN , First Publish Date - 2020-12-28T04:26:18+05:30 IST

భద్రాచలం వద్ద గోదావరిలో ఆదివారం ఓ యువకుడు గల్లంతయ్యాడు.

గోదావరిలో యువకుడి గల్లంతు

భద్రాచలంటౌన్‌, డిసెంబరు 27: భద్రాచలం వద్ద గోదావరిలో ఆదివారం ఓ యువకుడు గల్లంతయ్యాడు. హైదరా బాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సిరిసాల విజయ్‌(27), బండారు స్వరణ్‌, రమేష్‌, దినేష్‌ ఈ నెల 26న అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న తమ స్నేహితుడిని కలుసుకునేందుకు వచ్చారు. అనంతరం భద్రాచలంలో రామయ్య దర్శనం కోసం నలుగుర స్నేహితులు ఆదివారం ఉదయం వచ్చారు. ఈ క్రమంలో గోదావరిలో స్నానం చేసేందుకు నదిఒడ్డుకు చేరుకున్న నలుగురిలో ముందుగా ముగ్గురు నీటిలో దిగారు. ఈ క్రమంలో లోతు అంచనా వే యలేని విజయ్‌ ప్రవాహంలో కొట్టుకుపో యాడు. స్థానికుల సమాచారంతో సంఘ టన స్థలానికి చేరుకున్న రెవెన్యూ, పోలీ సు అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం వరకు వరకు ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలను భద్రాచలం తహసీల్దార్‌ శ్రీనివాస యాదవ్‌, సీఐ టి.స్వామి పర్యవేక్షించారు. 


Updated Date - 2020-12-28T04:26:18+05:30 IST