బీహెచ్‌ఈఎల్‌ ఇంజనీర్లకు లాకౌట్‌ కష్టాలు

ABN , First Publish Date - 2020-04-15T06:27:24+05:30 IST

విధి నిర్వహణలో భాగంగా పలు రాష్ట్రాలకు చెందిన బీహెచ్‌ఈఎల్‌ ఇంజనీర్లు పాల్వంచలోని కేటీపీఎ్‌సకు వచ్చి

బీహెచ్‌ఈఎల్‌ ఇంజనీర్లకు లాకౌట్‌ కష్టాలు

 మూడు నెలలుగా పాల్వంచలోనే మకాం


కేటీపీఎ్‌స,(పాల్వంచ), ఏప్రిల్‌ 14: విధి నిర్వహణలో భాగంగా పలు రాష్ట్రాలకు చెందిన బీహెచ్‌ఈఎల్‌ ఇంజనీర్లు పాల్వంచలోని కేటీపీఎ్‌సకు వచ్చి లాకౌట్‌లో చిక్కుకు పోయారు. కేటీపీఎస్‌ ఏడోదశ వార్షిక మరమ్మతులకు వచ్చిన బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ కు చెందిన 20మంది ఇంజనీర్లు తమ ఆప్రాంతాలకు వెళ్లేందుకు ఎటువంటి వాహన సౌకర్యం లేక పోవటంతో లాకౌట్‌ ఎత్తివేతపై ఆశలు పెట్టుకున్నారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాక్‌డౌన్‌ను మే 3వతేదీ వరకూ పొడించటంతో తీవ్రమైన నిరాశకు లోనయ్యారు.


కేటీపీఎస్‌ ఏడోదశతో బీహెచ్‌ఈఎల్‌ ఒప్పందం ముగియకపోవటంతో సంస్థ జనరల్‌ మేనేజర్‌ శ్రీవాత్సవతో పాటు కీలకమైన విభాగాల ఇంజనీర్లు కేటీపీఎస్‌ కే పరిమితం కావల్సి వచ్చింది. వారికి ఎటువంటి వసతి కష్టాలు లేకపోవటంతో వారు కాస్త ఉపశమనం పొందుతున్నారు.  ప్రస్తుతానికి ఇంజనీర్లతో తమకేమీ పనిలేదని లాక్‌ డౌన్‌ కారణంగానే వారు ఇక్కడ ఉంటున్నారని కేటీపీఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సమ్మయ్య ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

Updated Date - 2020-04-15T06:27:24+05:30 IST