భట్టి అబద్ధాల మాటలతో పేదలను మభ్య పెట్టలేరు.
ABN , First Publish Date - 2020-10-03T11:19:53+05:30 IST
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అబద్ధాలతో పేదలను మభ్య పెట్టలేరని జడ్పీచైౖర్మన్ లింగాల కమల్‌రాజ్, ..

ఖమ్మంటౌన్, అక్టోబరు 2: డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అబద్ధాలతో పేదలను మభ్య పెట్టలేరని జడ్పీచైౖర్మన్ లింగాల కమల్‌రాజ్, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ గుండాల కృష్ణ విమర్శించారు. శుక్రవారం జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చూపిస్తే.. తల తిరిగిన భట్టి అక్కడనుండి పారిపోయి ఖమ్మం వచ్చి డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. భట్టికి ఖమ్మంలో కాని, ఖమ్మం జిల్లాలో కాని మంజూరైన డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై అవగాహన లేదన్నారు. ఈ సమావేశంలోకొండబాల కోటేశ్వరరావు, గుండాల కృష్ణ, సుడా ఛైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, నాయకులు బొమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు.