లారీ, బైక్ ఢీ: ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2020-03-24T12:30:50+05:30 IST
లారీ, బైక్ ఢీ: ఇద్దరికి గాయాలు

దుమ్ముగూడెం, మార్చి 23: లారీ బైక్ ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలపరిధిలోని ఆంధ్రకేసరి కాలనీ ప్రధాన రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని డబ్లుఎల్ రేగుబల్లికి చెందిన కాల్వ ప్రశాంత్, జెట్టి వినీత్‌లు బైక్‌పై చిననల్లబల్లి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం వినీత్‌ను మెరుగైన వైద్యచికిత్సల కోసం ఖమ్మం తరలించినట్లు స్థానికులు తెలిపారు.