మద్యం దొరక్క వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-03-30T11:18:53+05:30 IST

మద్యానికి బానిసైన ఓ వక్తి లాక్‌డౌన్‌తో మద్యం సమయానికి దొరకకపోవడంతో తట్టుకోలేక కత్తితో గొంతు కోసుకొని, కడుపులో పొడుచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో శనివారం అర్ధరాత్రి

మద్యం దొరక్క వ్యక్తి ఆత్మహత్యాయత్నం

గొంతుకోసుకొని, కడుపులో పొడుచుకున్న వైనం

పరిస్థితి విషమం.. ఖమ్మం తరలింపు

అశ్వారావుపేట, మార్చి 29:  మద్యానికి బానిసైన ఓ వక్తి లాక్‌డౌన్‌తో మద్యం సమయానికి దొరకకపోవడంతో తట్టుకోలేక కత్తితో గొంతు కోసుకొని, కడుపులో పొడుచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో శనివారం అర్ధరాత్రి 1.30గంటలకు జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అశ్వారావుపేట మోడల్‌కాలనీకి చెందిన మర్రివాడ రాంబాబు హైదరాబాదులో కార్పెంటర్‌గా పనిచేస్తూ ఇటీ వలే ఇంటికి వచ్చాడు. పనులు లేకపోవడం, తాగడానికి డబ్బు లు ఇబ్బంది, మద్యంకూడా సరిగ్గా దొరకకపోవడంతో శనివారం అర్ధరాత్రి ఇంట్లోనే కత్తితో పీక కోసుకొని, కడుపులో పొడుచుకొని ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యు లు అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలు చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. 

Updated Date - 2020-03-30T11:18:53+05:30 IST