కేటీపీఎస్ పదో యూనిట్ రిజర్వ్ షట్‌డౌన్
ABN , First Publish Date - 2020-10-31T06:40:11+05:30 IST
జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ పదో యూనిట్‌ను అధికారులు రిజర్వ్ షట్‌డౌన్ చేశారు

పాల్వంచ, అక్టోబరు 30: జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ పదో యూనిట్‌ను అధికారులు రిజర్వ్ షట్‌డౌన్ చేశారు. 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్ వారం రోజులుగా పని చేయడంలేదు. 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే 11వ యూనిట్‌లో కూడా విద్యుత్ బ్యాక్‌డౌన్ చేసి నడుపుతున్నారు. 9వ యూనిట్‌లో వైబ్రేషన్స్ కారణంగా పరిశీలన కోసం పూర్తిస్థాయి విద్యుత్‌తో నడుపుతున్నట్టు సీఈ రవీందర్ కుమార్ శుక్రవారం తెలిపారు.