ముందు కొవిడ్‌.. వెనుక సీజనల్‌!

ABN , First Publish Date - 2020-09-17T10:16:35+05:30 IST

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటం, మృతులు నమోదవుతుండటంతో సర్వత్రా ఆందోళన

ముందు కొవిడ్‌.. వెనుక సీజనల్‌!

వైద్యానికి నిరాకరిస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు

చిన్నపాటి జలుబుకైనా ఎక్స్‌రేలు, ఛాతీ పరీక్షలంటూ కొర్రీలు

ఇదే అదునుగా ఆర్‌ఎంపీల ఇష్టారాజ్యం

ప్రభుత్వం వద్దని చెబుతున్నా సొంత వైద్యం


అశ్వారావుపేట, సెప్టెంబరు 16: కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటం, మృతులు నమోదవుతుండటంతో సర్వత్రా ఆందోళన కలుగుతోంది. ఈ తరుణంలో ప్రజలు ఒకప్పటిలా భయటకు రావాలంటే జంకుతున్నారు. వ్యాపారాలు మం దగించడంతో చాలా మందికి ఉపాధి లభించడం గగనమైంది. అసలే కొవిడ్‌ వెన్నులో వణు కు పుట్టిస్తోంటే.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. జలు బు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిఽధిలోని మారుమూల గ్రామాల్లో పైలక్షణాలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గతంలో వానాకాలం ప్రారంభమైందంటే చాలు వైద్యాధికారులు మారుమూల గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసేవారు. ప్రజల నుంచి రక్తపూతలు సేకరించి వారిలో మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ ఇతర లక్షణాలున్నట్టు తేలితే ప్రత్యేక వైద్యచికిత్సలందజేసేవారు.


దీనివల్ల సీజనల్‌ వ్యాధులు విజృంభించకుండా అడ్డుకట్ట పడేది. కానీ వైద్యారోగ్య శాఖ కొవిడ్‌-19 మీద దృష్టి సా రిస్తుండటంతో సీజనల్‌ వ్యాధుల వల్ల బాధపడేవారిని పట్టించుకునే వారే కరువయ్యారు. జ్వ రం, జలుబు, దగ్గు లక్షణాలతో వెళితే ఎక్కడ కొవిడ్‌-19 అంటారేమోనని చాలా మంది ఇం ట్లోనే తెలిసిన వైద్యం కానిచ్చేస్తున్నారు. మరోవైపు మారూముల గ్రామాల్లో ఆర్‌ఎంపీలే నేటికీ దిక్కుగా మారడంతో చాలా మంది వారినే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా జనం భయమే పరమాధిగా దండుకుంటున్నారు.  ప్రభుత్వం వద్దని చెబుతున్నా వారు సొంత వైద్యం చే స్తుండటం గమనార్హం. కొద్దోగొప్పో స్థోమత ఉన్నవారు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళితే అక్కడి వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరిస్తున్నారు. కొందరు చేసేందుకు ముందుకొస్తున్నా ఎక్స్‌రే, ఛాతీపరీక్షలు చేయించుకోవాలనే నిబంధన పెడుతున్నారు. ఫలితంగా ఇటు ఆరోగ్యం పరం గా, అటు ఆర్థికపరంగా రోగులు నష్టపోతున్నారు.


భయభ్రాంతులకు గురి చేస్తున్నారు

కరోన నేపథ్యంలో దూర ప్రాంతానికి ఎంతో అవసరమైతే తప్పితే వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్యులు, ఆర్‌ఎంపీలు అటువంటి రోగులకు వైద్యచికిత్సల పేరుతో భారీగా దండుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. పలు రకాల పరీక్షలు, ప్లేట్‌లెట్స్‌ తగ్గాయని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరోవైపు కరోనా కేసులు నమోదయితేనే గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి.  కొన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీల్లో మురుగు తొలగింపు, బ్లీచింగ్‌పౌడర్‌ చల్లడంపై దృష్టి  సా రిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆంధ్రాకు సరిహద్దున ఉన్న నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ఏ గ్రామంలోనూ దోమల నివారణ మందు పిచికారీ చేయలేదు.


గతంలో కూడా ఇక్కడ రికార్డు స్థాయిలో డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా కేసులు ఎక్కువగా నమోద య్యాయి. ఈఏడు కొవిడ్‌-19 వల్ల సీజనల్‌ వ్యాధులు అంతగా ప్రబలలేదని వైద్యారోగ్య శాఖ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తే సీజనల్‌ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.

Updated Date - 2020-09-17T10:16:35+05:30 IST