కరోనా కాలంలో పోలీసుల సేవలు అమోఘం

ABN , First Publish Date - 2020-12-31T04:46:14+05:30 IST

కరోనా కాలంలో పోలీసుల సేవలు వెలకట్టలేనివని కొత్తగూడెం ఓఎ్‌సడీ తిరుపతి అన్నారు.

కరోనా కాలంలో పోలీసుల సేవలు అమోఘం
సమావేశంలో మాట్లాడుతున్న ఓఎస్డీ తిరుపతి

కొత్తగూడెం ఓఎస్డీ తిరుపతి

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, డిసెంబరు 30: కరోనా కాలంలో పోలీసుల సేవలు వెలకట్టలేనివని కొత్తగూడెం ఓఎ్‌సడీ తిరుపతి అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2020 సంవత్సరంలో 4,185 కేసులు నమోదయ్యాయన్నారు. అందులో 20 హత్య కేసులు ఉండగా నిందితులను అరె్‌స్టచేసి కోర్టులో హాజరుపర్చామని తెలిపారు. 128 దొంగతనాలు జరగగా రూ.2.80లక్షలు చోరీ సొత్తుకుగాను రూ.1.45లక్షల రికవరీ చేయబడిందన్నారు. గతేడాదితో పోల్చుకుంటే రికవరీ 51.64శాతానికి త గ్గాయని పేర్కొన్నారు. 155 రోడ్డు ప్రమాదాలు జరగగా 168 మంది చనిపోయారని 53 మంది క్షతగాత్రులుగా నమోదయ్యారని వివరించారు. 1,589 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేయగా 113 మంది జైలు శిక్షను అనుభవిస్తున్నారని, వారి వద్ద నుంచి రూ.16.88లక్షలు జరిమానా విధించామని తెలిపారు. 4,33,948 మందిపై ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు నమోదు కాగా, రూ.12కోట్లు ఈ-చలానా రూపంలో జరిమానా విధించామన్నారు. రాష్ట్రంలోనే రాచకొండ తర్వాత భద్రాద్రి జిల్లాలోనే 66 కేసుల్లో 9,085 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.13.63 కోట్లు ఉంటుందన్నారు. గేమింగ్‌ యాక్ట్‌లో 101 కేసుల్లో 691 మందిని అరెస్ట్‌ చేయగా వారి వద్ద రూ.13.70లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 2020 ఏడాది కరోనా కారణంగా క్రైమ్‌ శాతం తగ్గుముఖం పట్టిందని, ఎస్పీ సునీల్‌దత్‌ పర్యవేక్షణ, జిల్లా ప్రజల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కొత్తగూడెం త్రీ టౌన్‌, టూ టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు పి. వేణుచందర్‌, బి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-31T04:46:14+05:30 IST