జాలరుల వలకు చిక్కిన కొండచిలువ

ABN , First Publish Date - 2020-12-07T04:46:07+05:30 IST

జాలరులు చేపల కోసం వేసిన వలలో ఓ కొండ చిలువ చిక్కుకుం ది.

జాలరుల వలకు చిక్కిన కొండచిలువ
కొండచిలువను అడవిలో వదులుతున్న దృశ్యం

పాల్వంచ రూరల్‌, డిసెంబరు 2 : జాలరులు చేపల కోసం వేసిన వలలో ఓ కొండ చిలువ చిక్కుకుం ది. పాల్వంచ మండల పరిధిలోని తౌశిలగూడెం సమీపంలోని కిన్నెరసాని వాగులో చేపలకోసం ఆ గ్రామంలోని కొందరు వల వేశారు. కొద్ది సేపటికి చూస్తే అందులో 12 అడుగుల కొండచిలువ దర్శనమిచ్చింది. దీంతో భయకంపితు లైన గ్రామస్థులు వెంటనే పాల్వంచలోని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాక అధికారులు కొత్తగూడెంలోని స్నేక్‌ రెస్క్యూ టీం సభ్యులు మహేష్‌, ప్రవీణ్‌ను వెంటబెట్టుకుని ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కొండచిలువను చాకచక్యంగా వలనుండి తప్పించిన రెస్క్యూ టీం సభ్యులు దానిని సురక్షితంగా ముసలిమడుగు అటవీ ప్రాంతంలో వదిలారు.


Read more