వైద్యసేవలు భేష్‌.. రికార్డుల నిర్వహణ లేదు

ABN , First Publish Date - 2020-12-17T04:33:30+05:30 IST

జిల్లా ఆసుపత్రి లో వైద్యసేవలు భేష్‌ అంటూ కితాబునిస్తూనే.. రికార్డుల నిర్వహణ సరిగా లేదని జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం పేర్కొంది.

వైద్యసేవలు భేష్‌.. రికార్డుల నిర్వహణ లేదు
డాక్టర్లు, నర్సింగ్‌ ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తున్న ఎన్‌ క్వాష్‌ బృందం సభ్యులు

జిల్లా ఆసుపత్రిని పరిశీలించిన 

జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం

ఖమ్మంసంక్షేమవిభాగం, డిసెంబరు16: జిల్లా ఆసుపత్రి లో వైద్యసేవలు భేష్‌ అంటూ కితాబునిస్తూనే.. రికార్డుల నిర్వహణ సరిగా లేదని జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం పేర్కొంది. బుధవారం ఎన్‌ క్వాష్‌ బృందం  సభ్యులు సురేశ్‌, దివాకర్‌, రాధిక, శ్రీకాంత్‌రాజు రిజ్వాన్‌ ఆలీ జిల్లా ఆసుపత్రిని పరిశీలించారు. క్యాజు వాలిటీ, బ్లడ్‌ బ్యాంక్‌, ఐసీయూ, ఎన్‌ఆర్‌సీ, మార్చురీ, అపరేషన్‌ ధియోటర్లు, ల్యాబ్‌,ఆసుపత్రిలోని ప్రతీవిభాగాన్ని క్షుణంగా పరిశీలించారు. డాక్టర్ల నుంచి శానటరీ ఉద్యోగుల వరకు వైద్య ప్రమాణాలను పరిశీలించారు. మాతాశిశు విభాగంలో రివ్యూ నిర్వహించారు. రోగులకు వైద్యసేవలు మంచిగా అందిస్తున్నారని ఆదే క్రమంలో చేసిన పనిని నమోదు చేస్తూ ఆన్‌లైన్‌లో ఉంచాలని సూచించారు. కొన్ని లోపాలను సరిదిద్దుకుంటే ఎన్‌ఏబీఎస్‌ స్థాయి వరకు జిల్లా ఆసుపత్రి వెళ్తోందని సలహా ఇచ్చారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ.వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో బొల్లికొండ శ్రీనివాసరావు, ఏవో రాజశేఖర్‌గౌడ్‌, మాతా శిశు విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ కృపాఉషశ్రీ, డాక్టర్‌ సురేశ్‌, నర్సింగ్‌ సూపరిం టెండెంట్‌ సుగుణ, క్వాలిటీ మెనేజరు ఉపేంద్ర, ఔషధ పర్యవేక్షకులు రాజేందర్‌, మహేందర్‌, హెడ్‌నర్స్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-17T04:33:30+05:30 IST