‘పది’ పరీక్షలకు కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2020-03-21T06:29:04+05:30 IST

‘పది’ పరీక్షలకు కరోనా ఎఫెక్ట్‌

‘పది’ పరీక్షలకు కరోనా ఎఫెక్ట్‌

  • 23నుంచి పరీక్షలు వాయిదా 
  • నేటి పరీక్ష యథాతథం
  • రెండో రోజు 79మంది గైర్హాజరు


కొత్తగూడెం సాంస్కృతికం, మార్చి 20: కరోనా వైరస్‌ ప్రభావం పదో తరగతి పరీక్షలపైనా పడింది. ఈ మహమ్మారిని నిరోధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టగా తాజాగా పదో తరగతి పరీక్షలను కూడా వాయిదా వేసింది. పదో తరగతి పరీక్షలను హైకోర్టు ఆదేశాలమేరకు 23వ తేదీనుంచి జరిగే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.సరోజనీదేవి వెల్లడించింది. అయితే శనివారం జరగనున్న 2వ లాంగ్వేజ్‌ అయిన హిందీ/సాంస్కృతం పరీక్షలు మాత్రం షేడ్యూల్‌ ప్రకారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 23నుంచి 30వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలకు తదుపరి రీ షెడ్యూల్‌ చేస్తామన్నారు. 30నుంచి ఏప్రిల్‌ 6తేదీవరకు జరగాల్సిన పరీక్షలను అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు డీఈవో సరోజిని దేవి పేర్కొన్నారు.

  

రోండో రోజు 79 మంది గైరుహాజరు

జిల్లాలో రెండో రోజైన శుక్రవారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా 79మంది గైర్హాజరయ్యారు. తెలుగు -11 మొత్తం 13,155 మంది రాయాల్సి ఉండగా 13076మంది హాజరయ్యారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో కరోనా’ జాగ్రత్తలు పాటించారు.

Updated Date - 2020-03-21T06:29:04+05:30 IST