మాస్కులు, శానిటైజర్ల కొరత లేకుండా పరిశీలన
ABN , First Publish Date - 2020-03-23T09:53:55+05:30 IST
మందుల షాపుల్లో మాస్కులు, శానిటైజర్లను కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న వదంతులు, ఆరోపణ నేపథ్యంలో...

ఖమ్మం కలెక్టరేట్, మార్చి 22: మందుల షాపుల్లో మాస్కులు, శానిటైజర్లను కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న వదంతులు, ఆరోపణ నేపథ్యంలో కలెక్టర్ కర్ణన్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ఎన్ మధుసూధన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఆదివారం నగరంలోని వివిధ మందుల షాపుల్లో స్టాక్‌ను పరిశీలించారు. డీఎస్వో కార్యాలయం అధికారులు, సిబ్బంది మూడు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. ఆయా దుకాణాల్లో ఉన్న మాస్కులు, శానిటైజర్లను పరిశీలించారు. ఎమ్మార్పి ధరలకన్నా అధికంగా విక్రయించ వద్దని సూచించారు. ఈ తనిఖీల్లో సివిల్‌సప్లై అధికారులు రామచంద్రయ్య, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.