ఐసోలేషన్‌కు ఒకరి తరలింపు
ABN , First Publish Date - 2020-03-23T09:56:18+05:30 IST
వారంరోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఒక యువకుడిని శనివారం అర్థరాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో ఐసోలేషన్ వద్దకు తరలించారు. మధ్యప్రదేశ్ చెందిన ఓ యువకుడు బోర్‌వెల్స్...

వైరా, మార్చి 22: వారంరోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఒక యువకుడిని శనివారం అర్థరాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో ఐసోలేషన్ వద్దకు తరలించారు. మధ్యప్రదేశ్ చెందిన ఓ యువకుడు బోర్‌వెల్స్ పని కోసం వైరా వచ్చాడు. వైరా శాంతినగర్ ప్రాంతంలో ఉంటూ వివిధ ప్రాంతాల్లో బోర్‌వెల్స్ వేస్తున్నాడు. వారంరోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో తమకందిన సమాచారం మేరకు పోలీస్, రెవెన్యూ, వైద్యఆరోగ్యశాఖ వారు శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆతర్వాత ఖమ్మం నుంచి ప్రత్యేక వాహనాన్ని రప్పించి కోవిడ్-19వైర్‌సకు సంబంధించిన జాగ్రత్తలతో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అంతేకాకుండా అతనితోపాటు పనిచేస్తున్న మరో 14మందిని ఆదివారం వైద్యపరీక్షల కోసం ఖమ్మం తీసుకువెళ్లారు.