ఇద్దరు ఎన్నారైల స్వీయగృహనిర్భంధం: కౌన్సెలింగ్‌ ఇచ్చిన ఆర్డీవో

ABN , First Publish Date - 2020-03-23T09:57:42+05:30 IST

వైరా మండలానికి చెందిన ఇద్దరు ఎన్నారైలను అధికారులు స్వీయగృహ నిర్బంధం చేశారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఇద్దరిని అబ్జర్వేషన్‌లో ఉంచి వారికి...

ఇద్దరు ఎన్నారైల స్వీయగృహనిర్భంధం: కౌన్సెలింగ్‌ ఇచ్చిన ఆర్డీవో

వైరా, మార్చి 22: వైరా మండలానికి చెందిన ఇద్దరు ఎన్నారైలను అధికారులు స్వీయగృహ నిర్బంధం చేశారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఇద్దరిని అబ్జర్వేషన్‌లో ఉంచి వారికి కార్వంటైన్‌ స్టాంపులు వేశా రు. మండలంలోని పుణ్యపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి 18న సత్తుపల్లిలోని తన అత్తగారింటికి చేరుకున్నాడు. ఆయన తిరిగి శనివారం రాత్రి పుణ్యపురం వచ్చాడు.


దాంతో సమాచారం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్‌, వైద్యఆరోగ్యశాఖ, మండలపరిషత్‌ అధికారులు ఆదివారం పుణ్యపురంలో అతడితో మాట్లాడి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతనికి కార్వంటైన్‌ స్టాంపు వేశారు. 14రోజులపాటు ఇంట్లోనే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని సూచించారు. ఆతర్వాత దాచాపురం గ్రామం వెళ్లి ఈనెల 18న ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ వ్యక్తితో ఆర్డీవో రవీధ్రనాధ్‌ మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకి శనివారమే కార్వంటైన్‌ స్టాంపు వేశారు. ఆర్డీవోతోపాటు తహసీల్దార్‌ హళావత్‌ రంగా, ఎంపీడీవో కె.రామ్మోహన్‌, సీఐ జె.వసంతకుమార్‌, డాక్టర్‌ సుచరిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-23T09:57:42+05:30 IST