కరోనా భయంతో... ఊళ్లోకి రానివ్వలేదు

ABN , First Publish Date - 2020-03-23T10:06:02+05:30 IST

కరోనా భయంతో... ఊళ్లోకి రానివ్వలేదు

కరోనా భయంతో... ఊళ్లోకి  రానివ్వలేదు

కర్ణాటక వెళ్లి వచ్చిన కూలీలను అడ్డుకున్న గ్రామస్థులు


ఇల్లెందురూరల్‌, మార్చి22: పొట్ట కూ టి కోసం ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లారు. కరో నా భయంతో కూలీకి తీసుకెళ్ళిన కాంట్రాక్టర్‌ వెళ్లగొట్టాడు. కరోనా భయంతో ఉన్న ఊరి వాళ్లు ఊళ్లోకి రానివ్వడం లేదు అంటూ ఆ కూలీలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇల్లెందు మండలం లచ్చగూడెం పంచాయతీ వేపలగడ్డ, కొమ్మగూడెం, లచ్చ గూడెం గ్రామాలకు చెందిన 14 మంది కూలీ లు కర్ణాటక రాష్ట్రం మంత్రాలయం వద్ద రైల్వే కాంట్రాక్టర్‌ ఆధ్వర్యంలో కూలీ పనులు చేస్తు న్నారు.


కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరో నా భయం వెంటాడుతుండటంతో కూలీలను కాంట్రాక్టర్‌ ఇంటికి పంపించాడు. తాము ఇం టికి వస్తున్నాము అని కుటుంబ సభ్యు లకు సమాచారం ఇచ్చిన కూలీలు శనివారం ఇల్లెం దు వచ్చి వారి ఊరికి చెందిన ఆటో ద్వారా గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలోనే గ్రామాస్థులంతా అడ్డుకొని  ఊళ్లోకి రానివ్వలే దు. మీరు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు మీకు కరోనా సోకి ఉండవచ్చు, వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఊళ్లో అడుగు పెట్టా లని గ్రామస్థులు అడ్డుచెప్పారు. దీంతో ఆ కూలీలు ఏమీ చేయలేక ఊరి బయట ఉన్న గుడిలో రాత్రి నిద్రించారు.


కూలీలను తీసు కొచ్చిన ఆటో డ్రైవర్‌ను సైతం ఊరిలోకి గ్రామ స్థులు రానివ్వలేదు. అదివారం ఉదయం తహసీల్ధార్‌ మస్తాన్‌రావు, సీఐ వేణు చందర్‌ ఆధ్వర్యంలో ఆ మూడు గ్రామల కూలీలను గ్రామానికి దగ్గరలో ఉన్న కోటిలింగాల వద్ద సత్రానికి తరలించారు. ఆ కూలీలకు వైద్య ప రీక్షలు నిర్వహించి ఐసొలేషన్‌లో ఉంచను న్న ట్లు అధికారులు తెలిపారు. తమకు ఏ కరోనా సోకలేదని ఆ కూలీలు వాపోతున్నారు. తా మంతా ఆరోగ్యంగా ఉన్నామని కన్నీరు ము న్నీరవుతున్నారు.

Updated Date - 2020-03-23T10:06:02+05:30 IST