జనతా కర్ఫ్యూ విజయవంతం: కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి

ABN , First Publish Date - 2020-03-23T10:04:52+05:30 IST

జనతా కర్ఫ్యూ విజయవంతం: కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి

జనతా కర్ఫ్యూ విజయవంతం: కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి

కొత్తగూడెం కలెక్టరేట్‌, మార్చి 22: కోవిడ్‌-19 వైరస్‌ (కరోనా)ను తరిమికొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 24గంటల జనతా కర్ఫ్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజ యవంతమైంది. ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమై సంపూర్ణ కర్ఫ్యూ ను పాటించారని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జన తా కర్ఫ్యూ పరిస్థితిపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు తగిన సలహాలు, సూచనలిస్తూ జనతా కర్ఫ్యూ విజయంతానికి కృషిచేస్తున్నామన్నారు.


ప్రజలంతా ఇదే స్పూర్తితో సోమవారం ఉదయం 6గంటల వరకూ ఇంటి నుంచి బయటకు రాకుండా కర్ఫ్యూను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, కొత్తగూడెం ఆర్డీఓ స్వర్ణలత కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో తిరుగుతూ కర్ఫ్యూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎవ రూ బయటకు రాకున్నా పోలీస్‌, రెవెన్యూ, వైద్యశాఖల సిబ్బంది రోడ్లపై సంచరిస్తూ ఎవరైనా బయటకు వస్తే వారి వివరాలను సేకరిస్తూ ఇంటికి పంపుతున్నారు.

Updated Date - 2020-03-23T10:04:52+05:30 IST