కలకలం రేపిన ఫోన్‌కాల్
ABN , First Publish Date - 2020-03-23T09:56:57+05:30 IST
మండలకేంద్రంలోకి అదివారం గోవానుంచి ఓవ్యక్తి వచ్చాడని అతనికి కరోనా పాజిటీవ్ ఉందని అధికారులను గంటపాటు ఉరుకులు, పరుగులుపెట్టించింది. తీరా చూస్తే కారేపల్లి గ్రామానికి ...

కారేపల్లి మార్చి 22: మండలకేంద్రంలోకి అదివారం గోవానుంచి ఓవ్యక్తి వచ్చాడని అతనికి కరోనా పాజిటీవ్ ఉందని అధికారులను గంటపాటు ఉరుకులు, పరుగులుపెట్టించింది. తీరా చూస్తే కారేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి గుంటూరునుంచి వచ్చాడని తెలవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. కారేపల్లి గ్రామానికి చెందిన కొప్పెర శ్రీను రైల్వే లైన్ పనులకు కాట్రాక్టర్ వర్కర్‌గా పనికి వెళ్లాడు. అనేక ప్రాంతాల్లో పనిచేస్తుఉండే శ్రీను అదివారం ఇంటికి వచ్చాడు. ఇన్ని రోజులు ఎటు పనికి వెళ్ళావు అని చుట్టు పక్కలవారు అడిగారు. అయితే మద్యం మత్తులో ఉన్న శ్రీను గోవా వెళ్ళాఅనిచెప్పాడు.ఇది విన్నకొంతరు వ్యక్తలు వెంటనే తహసీల్దార్ పుల్లయ్య, ఎస్‌ఐ వెంకన్నకు సమాచారం అందించారు. అప్రమత్తమైనా అధికారులు వారి సిబ్బందితో ఆప్రాంతానికి వెళ్ళారు. తీర అధికారులు గట్టిగ అడగడంతో అసలు విషయం చెప్పాడు దీంతో అధికారులు ఊపీరిపీల్చుకున్నారు.