లైట్లు బంద్‌ చేయండి.. విద్యుత్తు పరికరాలు ఆన్‌లో ఉంచండి

ABN , First Publish Date - 2020-04-05T10:33:03+05:30 IST

కరోనా వైరస్‌పై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజలు ఐక్యతను చాటేందుకు ప్రధాని నరేంద్ర మోదీ

లైట్లు బంద్‌ చేయండి.. విద్యుత్తు పరికరాలు ఆన్‌లో ఉంచండి

టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ సురేందర్‌ 


కొత్తగూడెం కలెక్టరేట్‌ ఏప్రిల్‌ 04: కరోనా వైరస్‌పై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజలు ఐక్యతను చాటేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించే లైట్లు ఆర్పి జ్యోతులు వెలింగిచే కార్యక్రమంతో విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చూడాలని టీఎస్‌ ఎన్‌పడీసీఎల్‌ ఎస్‌ఈ సురేందర్‌ విద్యుత్‌ వినియోగదారులకు పిలుపు నిచ్చారు. ఆదివారం రాత్రి 9గంటలకు జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ వినియోగదారులు తమ ఇంట్లోని అన్ని లైట్లను మాత్రమే ఆపాలని, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, ఇతర విద్యుత్‌ పరికరాలు ఆఫ్‌ చేయాల్సిన పనిలేదన్నారు. లైట్లతోపాటు ఇతర విద్యుత్‌ పరికరాలు ఆఫ్‌ చేస్తే విద్యుత్‌ లోడ్‌ ఒకేసారి పడిపోయి సాంకేతిక సమస్య తలెత్తుతుందని, అలా కాకుండా కేవలం లైట్లు మాత్రమే ఆఫ్‌ చేయడం వల్ల ఎలాంటి సాంకేతిక సమస్య ఉండదన్నారు. వినియోగదారులు సమస్య తలెత్తకుండా ప్రధాన మంత్రి పిలుపును విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2020-04-05T10:33:03+05:30 IST