కల్లాలను సద్వినియోగం చేసుకోవాలి: ఏడీఏ

ABN , First Publish Date - 2020-11-26T05:11:29+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కల్లాలను సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు డివిజన్‌ ఏడీఏ తాతారావు రైతులకు సూచించారు.

కల్లాలను సద్వినియోగం చేసుకోవాలి: ఏడీఏ
కల్లాన్ని పరిశీలిస్తున్న ఏడీఏ

బూర్గంపాడు, నవంబరు 25: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కల్లాలను సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు డివిజన్‌ ఏడీఏ తాతారావు రైతులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని మోరంపల్లిబంజరకు చెందిన ఆవుల వెంకటరెడ్డి అనే రైతు తన పొలంలో నిర్మించిన కల్లాన్ని ఏడీఏ తాతారావు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో 33 మంది రైతులు దరఖాస్తు చేసుకొన్నారని, ఇందుఉలో రెండు కల్లాలు పూర్తి కాగా, ఎనిమిది నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T05:11:29+05:30 IST