గిరిజనులు ఆర్థిక పరిపుష్ఠి చెందాలి

ABN , First Publish Date - 2020-12-28T04:32:28+05:30 IST

గిరిజన రైతులు అన్ని రకాల పంటలు పండిస్తూ ఆర్థిక పరిపుష్టి చెందాలని, జేవీఆర్‌ ట్రస్టు ద్వారా వారికి నిరంతరంగా సేవలు అంది స్తామని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు.

గిరిజనులు ఆర్థిక పరిపుష్ఠి చెందాలి
మోటార్ల ద్వారా వస్తున్న నీటిని తాగుతున్న జలగం ప్రసాదరావు

జేవీఆర్‌ ట్రస్టు ద్వారా వారందరికీ సహకారమందిస్తాం

మాజీ మంత్రి జలగం ప్రసాదరావు

పలు గ్రామాల్లో రైతులకు వ్యవసాయ పరికరాల అందజేత

అశ్వారావుపేట రూరల్‌, డిసెంబరు 27: గిరిజన రైతులు అన్ని రకాల పంటలు పండిస్తూ ఆర్థిక పరిపుష్టి చెందాలని, జేవీఆర్‌ ట్రస్టు ద్వారా వారికి నిరంతరంగా సేవలు అంది స్తామని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. జలగం వెంగళరావు మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా అశ్వారావుపేట మండలంలోని వివిధ గ్రామాలలో పలు రకాల కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. మండలంలోని ఆరు గిరిజన గ్రామాల్లో 274 కొండరెడ్ల కుటుంబాలకు రగ్గులు ఉచితంగా పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి రగ్గులు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం కుడుములపాడులో 26 మంది గిరిజన రైతులకు ట్రస్ట్‌ ద్వారా మోటార్లు, స్టాటర్లు, ఫిల్టర్లు పంపిణీని చేపట్టారు. గతంలో నందిపాడులో మాజీ మంత్రి జలగం పర్యటించిన సమయంలో గిరిజనులు సాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించిన జలగం ప్రసాదరావు జేవీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా మోటార్లు పంపిణీ చేయాలని భావించారు. ఈమేరకు దాదాపు 200 ఎకరాల భూమికి సాగునీరందేలా అధికారులతో మాట్లాడి విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేయించి మో టార్లను ఉచితంగా అందించారు. కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి జలగం, ఎమ్మెల్యే మెచ్చాతో కలిసి మోటార్లను ప్రారంభించారు. అనంతరం రైతులకు అన్ని రకాల సామగ్రిని అందించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో కార్యక్రమంలో భాగస్వాములుగా మారిన విద్యుత్తు, అటవీశాఖ అధికారులను ఘనంగా సత్కరించారు. గిరిజనులు ఇక నుంచి అడవుల నరికివేతకు దూరంగా ఉండాలని కోరారు. 

జలగం కుటుంబ సేవలు మరువలేనివి..ఎమ్మెల్యే మెచ్చా

రాష్ట్రంలో, జిల్లాలో జలగం కుటుంబం చేసిన అభివృద్ది పనులు, సేవా కార్యక్రమాలు మరువలేనివని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. కుడుములపాడులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్దే ధ్యేయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మీ, సర్పంచి ఊకే వీరాస్వామి, యాట్ల మహేశ్వరరెడ్డి, సున్నం సరస్వతి, ఆదినారాయణ, కొండరెడ్ల ప్రత్యేక అధికారి సురేశ్‌కుమార్‌, విద్యుత్తు శాక డీఈ విజయ్‌, ఏడీ రమేశ్‌, ఏఈ రవితేజ, తహసీల్దారు చల్లా ప్రసాద్‌, ఎంపీవో సీతారామరాజు, రేంజర్‌ అబ్దుల్‌ రెహమాన్‌, ఎస్‌ఐ మధు ప్రసాద్‌, నారాయణపురం సొసైటీ అధ్యక్షులు నిర్మల పుల్లారావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మందపాటి రాజమోహనరెడ్డి, మాజీ సర్పంచ్‌ కారం ఎర్రయ్య, నాయకులు పకీర్‌, పుల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T04:32:28+05:30 IST