టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ
ABN , First Publish Date - 2020-11-13T09:24:15+05:30 IST
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వీఎంబంజర్‌కు చెందిన గోగినేని ఝాన్సీని నియమిస్తున్నట్లు ఆపార్టీ రాష్ట్ర నాయకులు గురువారం ఆమెకు ఉత్తర్వులను అందజేశారు
పెనుబల్లి, నవంబరు 12: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వీఎంబంజర్‌కు చెందిన గోగినేని ఝాన్సీని నియమిస్తున్నట్లు ఆపార్టీ రాష్ట్ర నాయకులు గురువారం ఆమెకు ఉత్తర్వులను అందజేశారు. ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూరపాటి వెంకటేశ్వర్లుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పెనుబల్లి మండల టీడీపీ నాయకులు యలమర్తి నాగాంజనేయరావు, మోరంపూడి చంద్రశేఖర్, కనగాల రాంబాబు, కృష్ణారావు, జ్యోతి, ఎంపీ.చౌదరి, పిలీప్, సాంబశివరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు ఆమెను అభినందించారు.