నేటినుంచి జేఈఈ మెయిన్స్
ABN , First Publish Date - 2020-09-01T06:41:08+05:30 IST
ఇంటర్ విద్యానంతరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి గాను దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు నేటినుంచి ఆరో తేదీ వరకు

నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 31: ఇంటర్ విద్యానంతరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి గాను దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు నేటినుంచి ఆరో తేదీ వరకు జరగనున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 5,672 మంది హాజరు కానున్నారు.
డేర్(దరిపల్లి ఇంజనీరింగ్)కళాశాలకు 1,170మంది, బొమ్మఇంజనీరింగ్ కళాశాలకు 990మంది, విజయ ఇంజనీరింగ్ కళాశాలకు 1,600 మంది, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు 990మంది, స్వర్ణభారతి ఇంజనీరింగ్ కళాశాలకు 992 మంది విద్యార్థులను కేటాయించారు. తొలిరోజు మంగళవారం ఉదయం సాయంత్రం రెండు షిఫ్టుల్లో బీ-ఆర్క్, 2, 3, 4, 5, 6తేదీల్లో జేఈఈ మెయిన్స్ జరుగుతుంది. బీ-ఆర్క్ పరీక్షకు 642 మంది విద్యార్థులు, జేఈఈ మెయిన్స్‌కు 5030మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, రెండోషిఫ్ట్ మధ్యాహ్నం 3గంటల నుంచి 6గంటల వరకు పరీక్ష జరుగుతుంది.