శాంతియుతం మా అభిమతం

ABN , First Publish Date - 2020-12-28T04:28:09+05:30 IST

మానవత్వం ఎప్పుడైతే పత నం వైపు పయనిస్తుందో నైతిక విలువలు గుర్తింపు కోల్పో తాయని జైన మత గురువు, తత్వవేత్త ఆచార్యశ్రీ మహశ్రమణ్‌ పేర్కొన్నారు.

శాంతియుతం మా అభిమతం
ఆశీర్వాదం తీసుకుంటున్న ఎమ్మెల్యే వనమా

జైనమత గురువు ఆచార్య  శ్రీ మహశ్రమణ్‌

చుంచుపల్లి, డిసెంబరు 27: మానవత్వం ఎప్పుడైతే పత నం వైపు పయనిస్తుందో నైతిక విలువలు గుర్తింపు కోల్పో తాయని జైన మత గురువు, తత్వవేత్త ఆచార్యశ్రీ మహశ్రమణ్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ అహింసాయాత్ర ఆదివారం భద్రాద్రి జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయంగా పలుదేశాల్లో పాదయాత్రను నిర్వహిస్తు న్నామని, అందులో భాగంగా భద్రాద్రి జిల్లాకు చేరుకున్నా మన్నారు. సమాజంలో సంఘర్షణ పరిస్థితి ఏర్పడినప్పుడు మహా పురుషులు తమ దివ్య కర్తవ్యం, తేజస్సు కలిగిన శౌర్యంతో మానవుని మేల్కొలిపే కార్యక్రమాలు నిర్వహిస్తా రని గుర్తుచేశారు. అటువంటి వారిలో భగవాన్‌ మహావీరుడు, గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద, మహాత్మగాంధీ, గురుదేవ్‌ తులసీ, ఆచార్య మహాప్రజ్ఞలు ఉన్నారన్నారు. వారు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని తెలిపారు. 2014లో నవంబరు 9న ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రారంభమైన ఈ అహింస యాత్ర దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 15వేల కిలో మీటర్లకు పైగా సాగు తుందన్నారు. నేపాల్‌ ప్రభుత్వం ఈ అహింస యాత్రపై తపాలా బిళ్లను సైతం ముద్రించిందని, జాతి, కుల, మత బేధాలకు అతీతంగా ఈ యాత్రలో ప్రతి ఒక్కరు పా ల్గొంటూ ఆచార్య దర్శనం పొందవచ్చని సూచించారు. కా ర్యక్రమంలో ఆలిండియా జైన్‌ సంఘం అధ్యక్షుడు కిషన్‌ లా ల్‌ జీ డాగాల్య, భద్రాద్రి జిల్లా అహింస యాత్ర జిల్లా ఇన్‌ ఛార్జ్‌ దిలీప్‌ పారేఖ్‌, సభ్యులు రమేష్‌ రాంకా, గౌతంచంద్‌ పారేఖ్‌, సురేష్‌ పారేఖ్‌, అశోక్‌ నాటా తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్న ఈ యాత్రకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదివారం జిల్లా కేంద్రంలో స్వాగతం పలికారు.  


Updated Date - 2020-12-28T04:28:09+05:30 IST