మెరుగైన సేవలతో మన్నన పొందాలి

ABN , First Publish Date - 2020-12-11T04:38:22+05:30 IST

ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.... మెరుగైన వైద్య సేవలందిస్తూ... ప్రజల మన్న నలు పొందాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతం పోట్రు వెల్లడించారు.

మెరుగైన సేవలతో మన్నన పొందాలి
రిజిస్టర్‌ను పరిశీలిస్తున్న పీవో గౌతమ్‌ పోట్రు

ఐటీడీఏ పీవో గౌతం పోట్రు

లక్ష్మీదేవిపల్లి, డిసెంబరు 10: ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.... మెరుగైన వైద్య సేవలందిస్తూ... ప్రజల మన్న నలు పొందాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతం పోట్రు వెల్లడించారు. గురువారం కొత్తగూడెం నియోజకవర్గంలోని చాతకొండ, సర్వారంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్లను, లైన్‌ లిస్ట్‌, వైద్య సేవలను పరి శీలించారు. ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వహించా లని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రతి రోజు క్రమం తప్పకుండా ఆస్పత్రులు తెరిచి ఉంచి వైద్యుల పట్ల నమ్మ కాన్ని కలిగించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులను ని వారించేందుకు అన్ని సదుపాయాలు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో భావ్‌సింగ్‌, ఏడీఎంహెచ్‌వో శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T04:38:22+05:30 IST