కేటీపీఎస్‌ లో ఇనుము దొంగలు!

ABN , First Publish Date - 2020-03-15T12:32:55+05:30 IST

నిత్యం విద్యుత్‌వెలుగులు ప్రసరించే కర్మాగారంలో ఇనుము దొంగలు రెచ్చిపోతున్నారు. లక్షల విలువైన పైపులను

కేటీపీఎస్‌ లో ఇనుము దొంగలు!

పట్టుకున్న కేటీపీఎస్‌ ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది


కేటీపీఎ్‌స,(పాల్వంచ), మార్చి 14: నిత్యం విద్యుత్‌వెలుగులు ప్రసరించే కర్మాగారంలో ఇనుము దొంగలు రెచ్చిపోతున్నారు. లక్షల విలువైన పైపులను దొంగిలించి పాత ఇనుము దుకాణంలో విక్రయిస్తుండగా శనివారం కేటీపీఎస్‌ ఎస్‌పీఎఫ్‌ పోలీసులు పట్టుకుని చోరీగుట్టురట్టు చేశారు. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు అనుబంధంగా ఉన్న కేటీపీఎస్‌ యాష్‌పాండ్‌లో ఎంతో విలువైన పైపులు ఉంటాయి. కేటీపీఎ్‌సలో విద్యుత్‌ ఉత్పత్తి నేపథ్యంలో బొగ్గు తగలబడిన అనంతరం మిగిలినబూడిదను యాష్‌పాండ్‌లోకి పంపేందుకు ఈ పైపులను ఉపయోగిస్తారు.


కేటీపీఎస్‌ యాష్‌ పాండ్‌ నుంచి దొంగలు తొలగించి తీసుకొచ్చిన పైపులను స్థానిక దమ్మపేట సెంటర్‌ సమీపంలోని ఓ పాత ఇనుము దుకాణంలో గ్యాస్‌కట్టర్‌లతో భాగాలుగా విడగొడుతున్న సంగతి తెలుసుకున్న ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది పాత ఇనుము దుకాణానికి వెళ్లి తనిఖీ చేశారు. యాష్‌పాండ్‌లో పైపులు పోయిన నేపథ్యంలో అక్కడ పనిచేసే కార్మికుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే యాష్‌పాండ్‌ నుంచి పైపులు ఎలా చోరీ చేశారు. దుకాణానికి ఎవరు చేరవేసారనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు విలేకరులకు తెలిపారు. 

Updated Date - 2020-03-15T12:32:55+05:30 IST