రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్‌కు నిరసనగా..బీజేపీ శ్రేణుల ఆందోళన
ABN , First Publish Date - 2020-10-28T10:30:33+05:30 IST
దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందనరావు, బంధువుల ఇళ్లల్లో అక్రమ సోదాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా ఖమ్మం, భద్రాద్రి

ఇరు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు
ముఖ్యమంత్రి సీఎం దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం మయూరీ సెంటర్/ కొత్తగూడెం, అక్టోబరు 27: దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందనరావు, బంధువుల ఇళ్లల్లో అక్రమ సోదాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టారు. మండల, పట్టణ కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళకు దిగారు. కొత్తగూడెంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పోలీసులు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఓటమి తప్పదని తెలిసి బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావును బీజేపీ నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలు పెడుతూ కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేసే కేసీఆర్‌కు ప్రజలు దుబ్బాకలో తగిన గుణపాఠం చేప్తారని అన్నారు.
కుటంబ పాలనకు చరమగీతం పాడాలి
రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచి రజాకార్ల పాలన, కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలని భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ కోరారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసు పాలన జరుగుతోందని, ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ బీజేపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు.