గుండెపోటుతో ఏపీవో సరిత మృతి

ABN , First Publish Date - 2020-12-28T04:30:08+05:30 IST

కొణిజర్ల మండల ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న ఏపీవో సరిత(40) ఆదివారం మృతి చెందారు.

గుండెపోటుతో ఏపీవో సరిత మృతి

కొణిజర్ల మండలంలో విధులు

కొణిజర్ల, డిసెంబరు 27: కొణిజర్ల మండల ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న ఏపీవో సరిత(40) ఆదివారం మృతి చెందారు. మూడు రోజులు సెలవులు ఉండటంతో వేంసూరు మండలం మర్లపాడు సోదరి ఇంటికి వెళ్లింది. శనివారం చాతిలో నొప్పి రావడంతో సత్తుపల్లిలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం కూడ ఫోన్‌ ద్వారా తోటి సిబ్బందితో మాట్లాడారు. చాతిలో నొప్పి వస్తుందని పర్వాలేదని చెప్పిన కొద్ది గంటలలోనే నొప్పి మరలరావడంతో మృతి చెందారు. గుండెపోటు వచ్చినట్లుగ సిబ్బంది బావిస్తున్నారు. కొణిజర్లలో పని చేస్తున్న మండలపరిషత్‌, ఈజీఎస్‌ సిబ్బంది అందరితోను మంచి ఉద్యోగిగా పేరుతెచ్చుకున్నారు. అకస్మాత్తుగ ఏపీవో మరణవార్త విన్న సిబ్బంది అంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. భర్త రాంబాబు మధిరలో ఐకేపీ ఏపీఎంగా పని చేస్తున్నారు. ఖమ్మంలో ఉంటూ విధులకు వస్తున్నారు. ఏపీఎం స్వగ్రామం కూడ వేంసూరు మండలం మర్లపాడు పక్కనే లచ్చన్నగూడెం. సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని ఈజీఎస్‌ సిబ్బంది తెలిపారు. 


Updated Date - 2020-12-28T04:30:08+05:30 IST