ఆడబిడ్డల శ్రేయస్సుకే ‘కల్యాణలక్ష్మి’

ABN , First Publish Date - 2020-12-11T04:36:31+05:30 IST

పేదింటి ఆడబిడ్డల శ్రేయస్సు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళ్యాణ లక్ష్మీ పథకం ప్రవేశపెట్టారని ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు.

ఆడబిడ్డల శ్రేయస్సుకే ‘కల్యాణలక్ష్మి’
చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ

ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ

టేకులపల్లి, డిసెంబరు 10:  పేదింటి ఆడబిడ్డల శ్రేయస్సు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళ్యాణ లక్ష్మీ పథకం ప్రవేశపెట్టారని ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు. ప్రభుత్వం మంజూరీ చేసి న కళ్యాణలక్ష్మీ చెక్కులను వారు టేకులపల్లి తహసీల్దార్‌ కా ర్యాలయంలో గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలను అమలుచేస్తూ పేదింటి ఆడబిడ్డల శ్రేయస్సు కోసం పాటుపడుతుందన్నారు. ఆడ బిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారంకాకూడదనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ఆర్ధిక సహామం అందిస్తుందన్నారు. రైతులు, పేదల సంక్షేమానికి కేసీఆర్‌ అనేక సంక్షే మ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కళ్యాణలక్ష్మీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. 53మంది లబ్ధిదారులకు చెక్కులు అందచేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కేవీ శ్రీనివాసరావు, ఎంపీపీ అధ్యక్షురాలు రాధ, సొసైటీ అధ్యక్షుడు లక్కినేని సురేందర్‌రావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-11T04:36:31+05:30 IST