ఆంజనేయస్వామి ఆలయాల్లో ఘనంగా పూజలు

ABN , First Publish Date - 2020-12-02T05:22:57+05:30 IST

కార్తీక మాసం సందర్భంగా మండలంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆంజనేయస్వామి ఆలయాల్లో ఘనంగా పూజలు
ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న సినీ దర్శకుడు వెంకీ కుడుముల

అశ్వారావుపేట రూరల్‌, డిసెంబరు 1: కార్తీక మాసం సందర్భంగా మండలంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశ్వారావుపేటతో పాటు ఊట్టపల్లి సమీపంలోని వెంకమ్మ చెరువుపై గల ఆంజనేయస్వామి ఆలయంలో అత్యంత భక్తిశ్రద్దల మధ్య పూజలు నిర్వహించారు. ఆంజనేయుడికి వివిధ రకాల అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకమ్మ చెరువుపై గల ఆలయానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆంధ్రాకు చెందిన అటవీశాఖ రేంజర్‌ సత్యప్రసాద్‌ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధికంగా పాల్గొన్నారు. చెరువుకట్టపై గల ఆంజనేయస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు కుడుముల వెంకీ దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు రఘునందనశర్మ, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T05:22:57+05:30 IST