రూ.మూడు లక్షల గుట్కాల పట్టివేత

ABN , First Publish Date - 2020-11-27T04:29:51+05:30 IST

మండల పరిధిలోని అల్లీనగరంలో బుధవారం అర్థరాత్రి రూ.మూడులక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

రూ.మూడు లక్షల గుట్కాల పట్టివేత

మధిర రూరల్‌, నవంబరు26: మండల పరిధిలోని అల్లీనగరంలో బుధవారం అర్థరాత్రి రూ.మూడులక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. అల్లీనగరం గ్రామానికి చెందిన ఎలాబండ అనే వ్యక్తి కిరాణాషాపు నడుపుతుంటాడు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వెంకట్రావ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌ మధిర పోలీస్‌ సిబ్బందితో కలిసి రాత్రి సమయంలో కిరాణాషాపును తనిఖీ చేశారు. షాపులో రూ.మూడులక్షలు విలువచేసే నిషేధిత గుట్కాప్యాకెట్లను పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో సిబ్బంది రామకృష్ణ, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T04:29:51+05:30 IST