ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-02T12:17:30+05:30 IST

తెలంగాణ సాంఘిక గురుకుల విద్యాలయాలు జూనియర్‌ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశం కోసం ఆదివారం

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు

 ఖమ్మంసంక్షేమవిభాగం, మార్చి 1: తెలంగాణ సాంఘిక గురుకుల విద్యాలయాలు జూనియర్‌ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశం కోసం ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 11పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెయ్యి సీట్లకు గాను 6,521మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా వారిలో 6,067మంది విద్యార్థులు పరీక్షలు హాజ రయ్యారు. 454మంది విద్యార్థులు పరీక్షలు గైరాజరయ్యారని ఏఆర్‌సీవో వెంకటేశ్వర్లు వివరించారు.

Updated Date - 2020-03-02T12:17:30+05:30 IST