వాహనదారులతో కిటకిట

ABN , First Publish Date - 2020-03-13T12:22:01+05:30 IST

బీఎస్‌-4 వాహనదారులు, ఇతర సేవలకోసం వస్తున్న వారితో రవాణా శాఖ కార్యాలయం కిటకిటలాడుతోంది.

వాహనదారులతో కిటకిట

ఖమ్మం కమాన్‌బజార్‌ మార్చి 12: బీఎస్‌-4 వాహనదారులు, ఇతర సేవలకోసం వస్తున్న వారితో రవాణా శాఖ కార్యాలయం కిటకిటలాడుతోంది. బీఎస్‌-4 వాహనాల రిజిస్ర్టేషన్‌ గడువు ఈనెల 31 వరకు మాత్రమే ఉంది. దీంతో వాహనదారులు రిజిస్ర్టేషన్‌ కోసం ఎ గబడుతున్నారు. రెండు, మూడేళ్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండా ఉన్న వాహనదారులు ఒ కేసారి కార్యాలయానికి వస్తున్నారు. అన్ని సే వల కోసం ప్రతి రోజు 200 కు మించి రారు. ప్రస్తుతం 400కు పైగా వివిధ సేవల కోసం వాహనదారులు వస్తున్నారని అధికారులు అంటున్నారు. ఇటీవల అధికారులు రిజిస్ర్టేషన్‌ చేయించుకోని వాహనదారులపై కఠిన చ ర్యలు తప్పవని హెచ్చరించటంతో తాకిడి ఎక్కువ అవుతోంది.


రవాణాశాఖకు పెరుగుతున్న ఆదాయం...

బీఎ్‌స-4వాహనాలను ఈనెల 31లోగా రిజిస్ర్టేషన్‌ చేయించు కోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్‌-4 వా హనదారులు రవాణాశాఖ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. రెండు, మూడేళ్ల క్రితం నుంచి పెండింగ్‌లో ఉన్న వాహనాలన్ని రిజిస్ర్టేషన్‌ చేయించుకుంటున్నారు. దీంతో ప్ర భుత్వానికి ఆదాయం చేకూరుతుంది. ఖమ్మం జిల్లా కార్యాలయంలో ప్రతి రోజు ద్విచక్రవాహనాలు, కార్లు కలిపి 250కు పైగా వాహనాలు రిజిస్ర్టేషన్‌కు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ద్విచక్రవాహనానికి రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.600, కారుకు రూ.1,300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రతినెల రూ.25 అపరాధ రుసుం ఉంటుంది. అంటే సుమారు రోజుకు రూ. రెండు లక్షలకు పైగా ఆదాయం వస్తున్నట్టు అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. కోట్ల అదాయం సమకూరుతున్నట్టు చెబుతున్నారు.


సిబ్బందిలేమితో ఇబ్బందులు..

 జిల్లా రవాణాశాఖ కార్యాలయం సిబ్బంది లేమితో ఇబ్బందులు పడుతోంది. రెండు సం వత్సరాలుగా జిల్లా రవాణాశాఖ అధికారిగా ఇన్‌చార్జ్‌లే పనిచేస్తున్నారు. రెండు జిల్లాల్లో బాధ్యతలు నిర్విర్తించటం ద్వారా అత్యవసర సేవలు అందించటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంవీఐ పోస్టు, ఏవో పోస్టు ఖా ళీ అయి ఏళ్లు గడుస్తున్నాయి అయినా ఇంతవరకు భర్తీ చేయలేదు. ఒకే ఒక్క అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌తోనే జిల్లా ప్ర ధాన కార్యాలయం నెట్టుకొస్తోంది. అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఆఫీస్‌ సిబ్బంది ఎవరైనా సెలవుల్లో వెల్తే ఇక అంతే. వాహనదారులు నానా తంటాలు ప డాల్సిందే. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో అధికారులను జిల్లాకు ఏర్పాటుచేసి రవాణాశాఖ సేవలు విస్తృతం చేయాలనే డిమాండ్‌ వ్యక్త మవుతోంది.

Updated Date - 2020-03-13T12:22:01+05:30 IST