మొక్కలను మేసిన మేకలు
ABN , First Publish Date - 2020-10-03T11:16:36+05:30 IST
వైరా మునిసిపాలిటీ పరిధిలో జాతీయ రహదారిలోని డివైడర్లపై మునిసిపల్ సిబ్బంది నాటుతున్న మొక్కలను మరోవైపు మేకలు మేస్తున్నాయి.
నిర్బంధించిన మునిసిపల్ సిబ్బంది
వైరా, అక్టోబరు 2: వైరా మునిసిపాలిటీ పరిధిలో జాతీయ రహదారిలోని డివైడర్లపై మునిసిపల్ సిబ్బంది నాటుతున్న మొక్కలను మరోవైపు మేకలు మేస్తున్నాయి. శుక్రవారం మొక్కలను మేస్తున్న మేకలను మునిసిపల్ సిబ్బంది బంధించి ట్రాక్టర్లలో మునిసిపల్ కార్యాలయానికి తరలించారు. మునిసిపల్ సమావేశహాలులో వాటిని బంధించారు. ఆసమయంలో మేకల కాపర్లు మునిసిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మునిసిపల్ కమిషనర్ వెంకటపతిరాజు వారిని మొదటి తప్పు కింద హెచ్చరించి మేకలను వదిలేశారు. మరోసారి మొక్కలను మేకలు వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో మునిసిపల్ కార్యాలయంలోనే ఓ మేక రెండు పిల్లలను ఈనింది.