ప్రతి కుటుంబానికి 10 వేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-05-17T10:45:02+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

ప్రతి కుటుంబానికి 10 వేలు ఇవ్వాలి

ఖమ్మం మయూరిసెంటర్‌, మే16: కరోనా నేపథ్యంలో ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శనివారం సరిత క్లినిక్‌ సెంటర్‌లో ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. రూ.20లక్షల కోట్లు కార్పొరేట్‌ శక్తుల కోసమేనన్నారు. తక్షణం పేదలకు నేరుగా డబ్బులు ఇచ్చి అదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌, వై విక్రమ్‌, రమేష్‌, వెంకట్‌ కుమార్‌, ఉపేంద్ర, సూర్యం తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-05-17T10:45:02+05:30 IST