ఇటుకల యంత్రంలో పడి బాలిక దుర్మరణం
ABN , First Publish Date - 2020-12-04T04:52:28+05:30 IST
సిమెంట్ ఇటుకలు తయారు చేసే యంత్రంలో పడి ఓ బాలిక మృతిచెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో గురువారం జరిగింది.

చుంచుపల్లి, డిసెంబరు 3: సిమెంట్ ఇటుకలు తయారు చేసే యంత్రంలో పడి ఓ బాలిక మృతిచెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో గురువారం జరిగింది. పాల్వంచ ప్రాంతానికి చెందిన అలకుంట శ్యాం పనుల నిమిత్తం తన భార్య, ఇద్దరు పిల్లలతో చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీకి వలస వచ్చాడు. స్థానిక ఓ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ఇటుకలు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగానే విధుల్లో ఉన్న సమయంలో అతని కుమార్తె నిత్య లేఖన (4) ఇటుకల తయారీ యంత్రం వద్దకు వెళ్లి.. మిషన్ ఆన్ చేసింది. మిషన్ ఆన్అయి బాలికకు తగిలి అలేఖ్య అందులో పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు మిషన్ను ఆపుచేశారు. అనంతరం బాలికను పరిశీలించగా జీర్ణాశయ భాగం పూర్తిగా దెబ్బతిని మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్హెచ్వో చల్లా అరుణ తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బాలిక దుర్మరణం పాలవ్వడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.