జీహెచ్‌ఎంసీ తరహాలో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-04-15T06:25:40+05:30 IST

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ తరహాలో

జీహెచ్‌ఎంసీ తరహాలో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 


ఖమ్మం కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 14: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ తరహాలో పూర్తిచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కరోనావైరస్‌ నేపధ్యంలో నగరపాలక సంస్థ పరిధిలో మంజూరైన పనులు కూలీల కొరతతో నిలిచిపోయాయి. వేసవిలో పనులు పూర్తిచేయకుంటే వర్షాకాలంలో చేయటం సాధ్యంకాదని భావించిన మంత్రి అజయ్‌కుమార్‌ మంగళవారం సాయంత్రం బోస్‌ బొమ్మసెంటర్‌, చర్చ్‌కాంపౌండ్‌ సెంటర్‌, ముస్తఫానగర్‌ సెంటర్‌లో ప్రారంభమైన రహదారి విస్తరణ పనులను, ధంసలాపురం ఆర్వోబీ బ్రిడ్జి అనుసంధానం బీటీరోడ్‌ పనులను పరిశీలించారు.


ఈ సందర్భంగా మంత్రి అధికారులతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో బీటీ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని ఆర్‌్క్షబీ అధికారులను ఆదేశించారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అభివృద్ధిపనులు పూర్తిచేశారని, అదే తరహాలో ఖమ్మంలోనూ పనులు పూర్తిచేయాలన్నారు.


వర్షాకాలంలో పనులు చేసే అవకాశం ఉండనందున వేసవిలోనే పనులు పూర్తిచేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్‌ డాక్టర్‌. జీ.పాపాలాల్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌జయంతి, ఆర్‌్క్షబీ ఈఈ శ్యాంప్రసాద్‌, పబ్లిక్‌హెల్త్‌ ఈఈ కంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-15T06:25:40+05:30 IST