బండ భారం

ABN , First Publish Date - 2020-12-03T05:56:33+05:30 IST

బండ భారం

బండ భారం


రూ.50పెరిగిన గ్యాస్‌సిలిండర్‌ ధర 

ఇరుజిల్లాల వినియోగదారులపై నెలకు సుమారు రూ.3.50కోట్ల భారం

ఖమ్మం కలెక్టరేట్‌, డిసెంబరు 2: ఇప్పటికే పెరుగుతున్న పెట్రోధరలతో సామాన్యులు అగచాట్లు పండుతుండగా.. ఇప్పుడు గ్యాస్‌బండ కూడా మరింత భారంగా మారుతోంది. నిత్యావసరమైన వంట గ్యాస్‌ ధరను ఏకంగా రూ.50 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు ధరను పెంచని ప్రభుత్వాలు.. ఎన్నికల ప్రక్రియ ముగియగానే పెట్రోవడ్డన చేశాయి. ఈ క్రమంలో ఇరుజిల్లాల్లోని సుమారు 7.50లక్షల మంది వినియోగదారులపై నెలకు రూ.3.50కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం గ్యాస్‌ వినియోగదారుల నుంచి 14కిలోల సిలిండర్‌కు రూ.628.50 పైసలు వసూలు చేస్తుండగా రాయితీ కింద రూ.19.21 పైసలను వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌పై ఏకంగా రూ.50ను పెంచడంతో.. నెలకు రూ.3.50కోట్లమేర అదనపు భారం పడనుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే పెంచిన ధరకు అనుగుణంగా రాయితీని కూడా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-12-03T05:56:33+05:30 IST