రెండు కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-12-08T04:58:08+05:30 IST

మణుగూరు పట్టణంలోని హనుమాన్‌ గుడి వద్ద గంజా యి విక్రయిస్తున్న వ్యక్తితోపాటు కొనుగోలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రెండు కిలోల గంజాయి పట్టివేత

మణుగూరు, డిసెంబరు 7: మణుగూరు పట్టణంలోని హనుమాన్‌ గుడి వద్ద గంజా యి విక్రయిస్తున్న వ్యక్తితోపాటు కొనుగోలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రెండు కేజీల గంజాయితోపాటు రూ.30 వేల నగదును స్వాదీనం చేసుకున్నారు. సీఐ భాను ప్రకాష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా.. హనుమాన్‌గుడి సి-టైపు క్రాస్‌ రోడ్డు వద్ద మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురానికి చెందిన పెనుగొండ గురువయ్య భద్రాచలం నుంచి రెండు కేజీల గంజాయిని తెచ్చాడు. అతడి వద్ద నుంచి గుట్టమల్లారం ప్రాంతానికి చెందిన గంగారపు సంజయ్‌, రాసమళ్ల జీవన్‌కుమార్‌ గంజాయిని కొనుగోలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు కేజీల గంజాయి, రూ.30 వేల నగదును స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ భాను ప్రకాష్‌ తెలిపారు.

Updated Date - 2020-12-08T04:58:08+05:30 IST