గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-12-18T04:51:01+05:30 IST

ఖమ్మం నగరంలోని త్రీటౌన్‌ పోలీసుస్టేసన్‌ పరిధిలో 95కేజీల గంజాయిని లారీలో సర్దుతుండగా టాస్కుఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి పట్టివేత
గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఖమ్మంక్రైం, డిసెంబరు 17: ఖమ్మం నగరంలోని త్రీటౌన్‌ పోలీసుస్టేసన్‌ పరిధిలో 95కేజీల గంజాయిని లారీలో సర్దుతుండగా టాస్కుఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. టాస్కుఫోర్స్‌ పోలీసుల కథనం ప్రకారం ఒడిస్సాలోని మల్కన్‌ గిరి నుంచి రాజస్థాన్‌కు తరలించేందుకు గంజాయి ప్యాకెట్లను ఖమ్మంలో లారీలో సర్దుతున్నారన్న విశ్వసనీయ సమాచారం రావడంతో టాస్కుఫోర్స్‌ ఏసీపీ గంటా వెంకటరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నగరంలోని ప్రకాష్‌నగర్‌ బ్రిడ్జి సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో ఒడిస్సా నుంచి కారులో ఖమ్మం తీసుకువచ్చి రాజస్థాన్‌కు తరలించేందుకు లారీలోకి 9మంది వ్యక్తులు గంజాయి సర్దుతుండగా టాస్కుఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.14లక్షల 25వేలు ఉంటుందని, ఒక లారీని, ఒక ఆటో, ఒక కారును, 9మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని చర్యల నిమిత్తం త్రీటౌన్‌ పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. ఈదాడుల్లో త్రీటౌన్‌ సీఐ శ్రీధర్‌, టాస్కుఫోర్సు ఎస్‌ ఐ సతీష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-18T04:51:01+05:30 IST