‘ఆట’విడుపు

ABN , First Publish Date - 2020-03-30T11:08:41+05:30 IST

ఆష్టాచమ్మా, పులి మేక, దాడి, పచ్చీస్‌.. ఈ తరానికి ఈ ఆటలు తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఈ ఆటలంటే తెలియని వారుండరు. ఏమాత్రం ఖాళీ దొరికినా ఆ తరం వారు ఈ ఆటలు ఆడేవారు. ఇందులో ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయి.

‘ఆట’విడుపు

లాక్‌డౌన్‌ వేళ నాటి ఆటలపై పిల్లల మక్కువ

‘అష్టాచమ్మా, పచ్చీస్‌, దాడి’తో కాలక్షేపం

సామాజిక దూరం పాటిస్తూ పెద్దలకు ఆదర్శం

ఖమ్మం స్పోర్ట్స్‌, మార్చి 29: ఆష్టాచమ్మా, పులి మేక, దాడి, పచ్చీస్‌.. ఈ తరానికి ఈ ఆటలు తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఈ ఆటలంటే తెలియని వారుండరు. ఏమాత్రం ఖాళీ దొరికినా ఆ తరం వారు ఈ ఆటలు ఆడేవారు. ఇందులో ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయి. మెదడుకు మేత పెట్టే మలుపులూ ఉంటాయి. అంతేనా ఆటలతో ఆప్యాయత పెరగుతుంది. ఎదుటి మనిషి ఎలా ఆలోచిస్తున్నాడో అర్థం అవుతుంది. ఇంటి పట్టున ఉండి ఆడే ఆటల ద్వారా మానసిక పరిపక్వత కూడా పెరుగుతుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. అప్పట్లో పెద్దలు కూడా చిన్నారులతో కలిసి ఆడేవారు. మానసిక ఆనందాన్ని పొందేవారు. కాలం మారింది. పాత ఆటలు కనుమ రుగయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆటకమీదకెక్కిన ఆటలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. 


మానసిక ఉల్లాసం 

కరోనా వైరస్‌ ప్రభావంతో పెద్దలు, చిన్నారులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మానసిక ఉల్లాసం కోసం నాటి ఆటలు ఆడుతున్నారు. కరోనా వైరస్‌ క ట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో విద్యాసంస్థలన్నింటికీ సెలవులు వచ్చాయి. దీంతో స్టేడియాలకు, ఆట స్థలాలకు సైతం విరామం ప్రకటించారు. ఇక చిన్న పిల్లలతో తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పే. వారి గోలను భరించలేక తల్లిదండ్రులు పాతకాలం నాటి ఆటలను పరిచయం చేస్తున్నారు. ఎప్పుడో అమ్మమ్మ, నానమ్మ కాలాల్లో ఆడిన ఆటలను ఇళ్ల నుంచి బయటకు రాకుండానే ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. టీవీలు, సెల్‌ఫోన్లల్లో వీడియోలు చూసి బోర్‌ కొట్టి పాత తరం ఆటల పట్ల ఆసక్తి చూపిస్తూన్నారు. మరోవైపు ఎలక్ర్టా నిక్‌ ఉత్పత్తులతో ఎక్కు వ కాలం గడపడం కూ డా ఆరోగ్యంపై ప్ర భా వం చూపు తుం దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తదేకంగా సెల్‌ఫో న్లను చూడటం వల్ల ఆ ప్రభావం కళ్లపై చూపిస్తోందని చె బుతున్నారు. ఇటీవల నేత్ర సంబంధమైన వ్యాధులకు గుర య్యే పెరుగుతున్నారని వివరిస్తున్నారు.


వెలుగులోకి పాత ఆటలు

లాక్‌డౌన్‌ కారణంతో విద్యాసంస్థలు, కార్యాల యాలకు సెలవులు వచ్చాయి. చిన్నారులు అష్టాచమ్మా, పచ్చీస్‌, దాడి, జువ్వా, కళ్లకు గంతలు, మా తాత ఉత్తరం, కోతి కొమ్మచ్చి, పత్తాలు, గచ్చకాయ ఆట, వానగుంటలు, పరమపదసోపానపటం (పాము ఆట) ఆడుతున్నారు. పెద్దలు క్యారమ్స్‌, చెస్‌ ఆడుతున్నారు. 


సంప్రదాయ  ఆటలను మరిచి పోవద్దు

పరంధామరెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి

పాత తరం సాంప్రదాయ క్రీడలను మరిచి పోకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా నేర్పాలి. ఇటీవల జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సాంప్రదాయ ఆటల్లో పోటీలు నిర్వహించి వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు సైతం పంపాం. లాక్‌డౌన్‌ సమయంలో సామాజిక దూరం పాటిస్తూ ఆటలు ఆడటం మంచి పరిణామం. భవిష్యత్‌లో కూడా పాతతరం ఆటల్లో పోటీలు నిర్వ హిస్తాం.

Updated Date - 2020-03-30T11:08:41+05:30 IST