ఖమ్మం,మధిర రైల్వేస్టేషన్లలో పూర్తిస్థాయి సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి.

ABN , First Publish Date - 2020-03-13T12:13:55+05:30 IST

ఖమ్మంస్టేషన్‌ను ఏ1 గ్రేడ్‌స్టేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని, ఖమ్మం,మధిర రైల్వేస్టేషన్లలో పూర్తిస్థాయి సీసీ కెమేరాలు

ఖమ్మం,మధిర రైల్వేస్టేషన్లలో పూర్తిస్థాయి సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి.

 లోక్‌సభలో ఖమ్మం ఎంపీ నామా. 


ఖమ్మంటౌన్‌, మార్చి12:  ఖమ్మంస్టేషన్‌ను ఏ1 గ్రేడ్‌స్టేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని, ఖమ్మం,మధిర రైల్వేస్టేషన్లలో పూర్తిస్థాయి సీసీ కెమేరాలు ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. తెలంగాణాలో పేదప్రజలు ఎక్కువగా రైళ్ల ద్వారానే ప్రయాణిస్తారని నామా పేర్కొన్నారు.


పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌, తాను ఎన్నోమార్లు కేంద్రమంత్రులకు లేఖలు రాసామని గుర్తు చేశారు. ఎంతో ప్రయోజనం కల్పించే భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైన్‌ నిర్మాణం పెండింగ్‌లో ఉందని, ఈ నిర్మాణానికి తాను 125 లేఖలు రాసానని గుర్తుచేశారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్‌ సౌకర్యం కల్పించాలని, ఖమ్మం, మధిర రైల్వేస్టేషన్లలో మహిళలకు, పురుషులకు వేరువేరుగా రెస్ట్‌రూమ్‌లు ఏర్పాటుచేయాలని నామా కోరారు.  

Updated Date - 2020-03-13T12:13:55+05:30 IST