రైతులకు ఉపయోగపడేవిధంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-12-04T04:54:32+05:30 IST
ఏన్కూరులో రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని గురువారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

మాజీ ఎంపీ పొంగులేటి
అగ్రోరైతు సేవ కేంద్రం ప్రారంభం
ఏన్కూరు, డిసెంబరు 3: ఏన్కూరులో రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని గురువారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే విధంగా రైతుసేవా కేంద్రం ఉండాలని, వ్యాపారాభివృద్ధిలో ముందుకు సాగాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని, తెలిపారు. తొలుత గార్లొడ్డు చేరుకున్న పొంగులేటి అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడారు. ఈకార్యక్రమంలో ఏన్కూరుసొసైటీ అధ్యక్షుడు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్చైర్మన్ భూక్యాలాలునాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సురే్షనాయక్,రైతుసేవా కేంద్రం నిర్వాహకులు శంకర్రావు, కిరణ్, నాయకులు మేడుకొండూరు ప్రసాద్, ముక్తి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, గాలిబ్సాహెబ్, నాగేశ్వరరావు, శివకుమార్, సత్యనారాయణ, రోశయ్య పాల్గొన్నారు.
రూ.15వేలు ఆర్థికసాయం
ఏన్కూరులో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన దుగ్గిరాల నాగయ్య కుటుంబానికి గాయత్రి క్లినిక్ మెడికల్ నిర్వాహకులు కొలిశెట్టి నరేష్ అందించిన రూ.15వేల ఆర్థికసాయాన్ని మాజీ ఎంపీ పొంగులేటి చేతులమీదుగా అందించారు.