న్యాయవాదులందరికీ ఆర్థిక సహాయం అందజేయాలి

ABN , First Publish Date - 2020-07-18T10:22:48+05:30 IST

లాక్‌డౌన్‌ వలన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులందరికీ రెండో విడత ఆర్థిక సహాయంగా 25వేలు అందజేయాలని

న్యాయవాదులందరికీ ఆర్థిక సహాయం అందజేయాలి

న్యాయవాదులు నిరసన


మధిర, జూలై 17: లాక్‌డౌన్‌ వలన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులందరికీ రెండో విడత ఆర్థిక సహాయంగా 25వేలు అందజేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం మధిర బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మధిర కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో  ఐలు ఆధ్వర్యంలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు వాసంశెట్టి కోటేశ్వరరావు, దిరిశాల జగన్‌మోహన్‌రావు, ప్రభాకర్‌రావు, సతీష్‌, వెంటకరమణ, అవ్వా విజయలక్ష్మీ, చావలి రామరాజు, వెంకట్రావ్‌, శ్రీనివాసరావు, వెంకటపతిరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-18T10:22:48+05:30 IST