చెరువులో పడి రైతు మృతి

ABN , First Publish Date - 2020-03-16T12:28:47+05:30 IST

మండలంలోని పెద్దబీరవల్లి గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి చెందాడు.

చెరువులో పడి రైతు మృతి

బోనకల్‌, మార్చి 15:  మండలంలోని పెద్దబీరవల్లి గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన యనమద్ది రంగయ్య(55) పొలం పనులతో పాటు గేదేల వెంట వెళ్తుంటాడు. గేదెలను మేపుకొని ఇంటికొచ్చే క్రమంలో అవి చెరువులోకి దిగాయి. వాటిని అల్లించే ప్రయత్నంలో బాగంగా చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందా డు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. 

Updated Date - 2020-03-16T12:28:47+05:30 IST