ఓసీ కార్మికుల విధుల బహిష్కరణ

ABN , First Publish Date - 2020-03-28T11:36:16+05:30 IST

సింగరేణి ఇల్లెందు ఏరియాలో శుక్రవారం ప్లే డేను రద్దు చేస్తూ సింగరేణి యజామాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ

ఓసీ కార్మికుల విధుల బహిష్కరణ

ఇల్లెందుటౌన్‌, మార్చి27: సింగరేణి ఇల్లెందు ఏరియాలో శుక్రవారం ప్లే డేను రద్దు చేస్తూ సింగరేణి యజామాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం కార్మికులు విధులకు హజరుకాకపోడంతో జేకే5 ఓసీలో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది.


ఈనెల 22న జనతా కర్ఫ్యూ సందర్బంగా ఆదివారం ఇల్లెందు ఏరియాలో సెలవు ప్రకటించారు. శుక్రవారం ప్లేడే సందర్బంగా విధులకు హాజరయ్యే కార్మికులకు ఆదివారం ప్లేడే ఇస్తామని సింగరేణి యజమాన్యం ప్రకటించడంతో కార్మికులు విధులకు హాజరుకాలేదు. సుమారు నాలుగు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా నిలిచిపోయింది. ప్లేడేతో సంబంధం లేకుండా యజామాన్యం ఆదివారాన్ని వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించాలని ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య, టీబీజీకేఎస్‌ నాయకులు రంగనాఽథ్‌, జగన్నాథం డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-03-28T11:36:16+05:30 IST