పుర, నగరపాలకాల్లో ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-08-16T11:03:52+05:30 IST

పట్టణ ప్రగతిలో భాగంగా ఖమ్మం నగరపాలక సంస్థతో సహా జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి పురపాలక సంస్థల్లో ప్రజామరుగుదొడ్లు

పుర, నగరపాలకాల్లో ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు

 రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌


ఖమ్మం కార్పొరేషన్‌, ఆగస్టు 15: పట్టణ ప్రగతిలో భాగంగా ఖమ్మం నగరపాలక సంస్థతో సహా జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి పురపాలక సంస్థల్లో ప్రజామరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం ఖమ్మంలోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొద్లను  కలెక్టర్‌ ఆర్‌వీ. కర్ణన్‌తో కలిసి ప్రారంభించారు.  రోటరీనగర్‌ పార్క్‌లో రూ.1.50లక్షలు, మయూరిసెంటర్‌లో రూ.9.75లక్షలు, ఎన్‌టీఆర్‌ సర్కిల్‌లో రూ.12.05 లక్షలతో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు, అలాగే రోటరీనగర్‌ పార్క్‌లో రూ.8లక్షల వ్యయంతో నిర్మించిన ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించిన మేరకు నగరంలో ప్రతి వెయ్యి మందికి ఒక ప్రజా మరుగుదొడ్డి నిర్మించాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్‌ జీ.పాపాలాల్‌, కమిషనర్‌ అనురాగ్‌జయంతి, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఉప మేయర్‌ బత్తుల మురళి, డీఈ రంగారావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


ప్రారంభోత్సవంలో వివాదం 

మయూరిసెంటర్‌లో ప్రజా మరుగుదొడ్ల ప్రారంభం సందర్భంగా శనివారం వివాదం నెలకొంది. తనకు చెప్నిన సమయానికి ముందే ప్రారంభోత్సవం చేశారని ఆరోపిస్తూ స్థానిక కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ నాగండ్ల దీపక్‌చౌదరి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగి మంత్రి వాహనం వెళ్లకుండా అడ్డు నిలిచారు. దాంతో పోలీసులు దీపక్‌చౌదరిని పక్కకు తొలగించారు..  

Updated Date - 2020-08-16T11:03:52+05:30 IST