సేంద్రియ ఎరువులతో నేలకు సారం
ABN , First Publish Date - 2020-12-06T04:31:14+05:30 IST
సేంద్రియ ఎరువులతో నేలకు సారం కలుగుతుందని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జానయ్య రైతులకు సూచించారు.

అశ్వారావుపేట రూరల్, డిసెంబరు 5: సేంద్రియ ఎరువులతో నేలకు సారం కలుగుతుందని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జానయ్య రైతులకు సూచించారు. వ్యవసాయ కళాశాల దత్తత గ్రామం అయిన మండలంలోని మద్దికొండలో శనివారం ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా 150 మంది రైతులకు చెందిన భూమిని పరీక్షించి అందుకు సంబంధించిన పరీక్షా ఫలితాల పత్రాలను రైతులకు అందించారు. ఈసందర్భంగా సర్పంచ్ తాటి భవాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అభ్యుదయ రైతు వెంకటేశ్వరరావు, కళాశాల శాస్త్రవేత్తలు ఐ.వి.ఎ్‌స.రెడ్డి, గోపాలకృష్ణ, రాంప్రసాద్, ఎల్. రాజా, సావని, కరుణాకర్ పాల్గొన్నారు.